విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే గణేశ్ వినూత్న నిరసన

12-01-2020 Sun 11:50
  • విశాఖ రెండో పట్టణ పీఎస్‌ ప్రాంగణంలో వాహనాలు శుభ్రం చేసిన నేత
  • అమరావతి రైతుల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ నిరసన
  • మందడంలో కొనసాగుతోన్న నిరసనలు

విశాఖపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే గణేశ్‌కుమార్ వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనకు దిగారు. విశాఖ రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో వాహనాలు శుభ్రం చేసి ఆయన నిరసన తెలిపారు. అమరావతి రైతుల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ నిరసనకు దిగారు.

మరోవైపు, రాజధాని అమరావతి గ్రామాల్లో రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షల మధ్యే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్‌ 30 అమల్లో ఉన్నాయని మైకులో చెబుతూ పోలీసులు కవాతు చేస్తున్నారు. ఆంక్షల దృష్ట్యా ప్రజలు బయటకు రావద్దని, గూమి కూడవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మందడం రోడ్డుపై రైతులు టెంటు వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.