ఇది ప్రజాస్వామ్యమా...పోలీసు రాజ్యమా?: మాజీ మంత్రి నారా లోకేష్‌

12-01-2020 Sun 11:41
  • ఒక్కో గ్రామంలో వెయ్యి మంది పోలీసులా
  • రైతు ఉద్యమాన్ని అణచేందుకు ఇంత అవసరమా
  • అణచివేతతో ఉద్యమాన్ని ఆపలేరు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నట్టు లేదని, పోలీసు రాజ్యం కొనసాగుతున్నట్టుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేష్‌ అన్నారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఒక్కో గ్రామంలో వెయ్యి మంది పోలీసుల మోహరింపు దారుణమన్నారు. పల్లెల్లో పోలీసుల కవాతు ఏమిటన్నారు. రైతు ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఈస్థాయి పోలీసు చర్యలు అవసరమా? అని ప్రశ్నించారు. గ్రామస్థులను ఇళ్లలో బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రశాంతమైన గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం చిచ్చురేపుతోందని, ఇందుకు తగిన మూల్యం  చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా లోకేష్‌ పోలీసుల కవాతుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.