సంక్రాంతి ముందే వచ్చిందని 43 లక్షల కుటుంబాలు మురిసిపోతున్నాయి: విజయసాయిరెడ్డి

12-01-2020 Sun 11:27
  • అమ్మ ఒడి కింద కుటుంబాలు రూ.15 వేల చొప్పున ప్రయోజనం పొందాయి
  • ఇన్ సైడర్ భూముల కోసమే చంద్రబాబు  జోలె పట్టారు
  • ఆయన తీరు అందరికీ చికాకు తెప్పిస్తోంది
  • పండగ కూడా ప్రశాంతంగా చేసుకోనిచ్చేలా లేడని విసుక్కుంటున్నారు 

రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది కుటుంబాల్లో ముందే సంక్రాంతి పండుగొచ్చిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి కోసం జోలె పట్టుకుని విరాళాలు సేకరించిన చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు.

'అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయి. ఇన్ సైడర్ భూముల కోసం చంద్రబాబు నాయుడు జోలె పట్టుకుని లాంగ్ మార్చ్ చేస్తుండటం అందరికీ చికాకు తెప్పిస్తోంది. పండగ కూడా ప్రశాంతంగా చేసుకోనిచ్చేలా లేడని విసుక్కుంటున్నారు' అని విజయసాయిరెడ్డి అన్నారు.