New Delhi: జేఎన్‌యూ ఘటనలో గుర్తించిన నిందితులకు సిట్ నోటీసులు

  • మొత్తం తొమ్మిది మంది బాధ్యుల జాబితా విడుదల 
  • 13న విచారణకు హాజరు కావాలని ఆదేశం 
  • విద్యార్థినులు, విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించనున్న పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని జెఎన్‌యూ విద్యార్థులపై దాడి ఘటనలో నిందితులుగా భావిస్తున్న వారికి సిట్ నోటీసులు జారీ చేసింది. అర్ధరాత్రి ముసుగులు ధరించిన వ్యక్తులు వర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించి హాస్టల్ లోని విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి మొత్తం తొమ్మిది మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు.

వీరిలో జేఎన్‌యూ ఎసీయూ అధ్యక్షురాలు అయిషా ఘోష్ తో సహా ఏడుగురు వామపక్ష విద్యార్థులు, ఇద్దరు ఏబీవీపీ విద్యార్థులు ఉన్నారు. వీరికి సిట్ నోటీసులు జారీ చేసి ఈ నెల 13న జరిగే విచారణకు హాజరు కావాలని సూచించింది. విద్యార్థినులను మహిళా పోలీసు అధికారిణులు, మిగిలిన వారిని ఢిల్లీ కమ్లానగర్ క్రైం బ్రాంచ్ సిట్ అధికారులు ప్రశ్నిస్తారని ఆ నోటీసుల్లో పేర్కొంది. 

ఈ నోటీసులపై అయిషా ఘోష్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. తమపై ఆరోపణలకు ఉన్న ఆధారాలేమిటని, ఢిల్లీ పోలీసులైతేనే తాము విచారణకు హాజరవుతామని స్పష్టం చేసింది.

More Telugu News