‘అమరావతి’ కమిటీల నివేదికపై చర్చించేందుకు.. 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!

12-01-2020 Sun 09:07
  • 18న మంత్రి వర్గ భేటీ
  • ఆలోపు నివేదిక సమర్పించనున్న ఉన్నతస్థాయి కమిటీ
  • సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కమిటీలు ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలతోపాటు, వీటిని అధ్యయనం చేసి ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చే నివేదికపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. అప్పటికి ఉన్నతస్థాయి కమిటీ కూడా ప్రభుత్వానికి తమ అధ్యయన నివేదికను అందించనుంది. ఈ నేపథ్యంలో 20న శాసనసభను ప్రత్యేకంగా సమావేశ పరిచి వీటిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.