ప్రియురాలిని దూరం చేశారంటూ సెల్ టవర్ ఎక్కిన యువకుడు

12-01-2020 Sun 08:51
  • రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లులో ఘటన
  • ప్రియురాలిని దూరం చేశారని ఆవేదన
  • 8 గంటలపాటు హంగామా

ప్రియురాలి కోసం సెల్ టవర్ ఎక్కిన ఓ యువకుడు 8 గంటలపాటు నానా హంగామా చేశాడు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తలకొండపల్లికి చెందిన నీలకంఠం పాండు ఓ అమ్మాయిని ప్రేమించాడు. కొంతకాలంపాటు ఆమెతో సహజీవనం చేసిన పాండు.. ఇటీవల ఆమెను పెళ్లాడాడు. అయితే, కొందరు పెద్దలు తమను విడదీశారని, మళ్లీ తమను ఒక్కటి చేయాలని డిమాండ్ చేస్తూ ఆమనగల్లులోని సెల్‌టవర్ ఎక్కాడు.

ఉదయం 5:30 గంటలకు టవర్ ఎక్కిన పాండు.. సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో విషయం వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాండు ఎట్టకేలకు కిందికి దిగాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.