పృథ్వీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం

12-01-2020 Sun 08:03
  • పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులను అవహేళన చేసిన పృథ్వీ
  • కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దంటూ సీఎం ఆగ్రహం
  • కేవలం సమస్యపైనే మాట్లాడాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవహేళన చేసిన నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ (పృథ్వీ)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలను ప్రస్తావించడం సరికాదని, ఏదైనా సమస్య గురించి మాట్లాడాల్సి వస్తే.. కేవలం దాని గురించి మాత్రమే మాట్లాడాలని, కించపరిచేలా మాట్లాడడం సరికాదని అన్నట్టు తెలిసింది. ఇకపై ఎవరూ ఇలా మాట్లాడొద్దని నేతలను ఆదేశించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రైతులపై పృథ్వీ ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.