జగన్ ను ఫేస్ బుక్ లో అసభ్యంగా దూషించాడంటూ... వ్యక్తిపై కేసు నమోదు!

12-01-2020 Sun 07:10
  • సోషల్ మీడియాలో అసభ్య వీడియో
  • పుష్పశ్రీవాణి, రోజాలపైనా వ్యాఖ్యలు
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను సోషల్ మీడియా ద్వారా అసభ్య పదజాలంతో దూషించాడంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా వింజమూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సీఎంను దూషించారంటూ రావిపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దంతులూరి రఘు ఓ ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మండలంలోని బిల్లుపాటి రవిపై కేసు నమోదు చేశారు.

ఈ నెల8న తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను అప్ లోడ్ చేసిన రవి, జగన్, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే రోజాలను అసభ్యంగా దూషించాడని నిర్దారించారు. దీంతో రవిపై కేసును రిజిస్టర్ చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.