ఇకపై రూ. 10కే కంప్లీట్ బ్లడ్ కౌంట్... ఖరగ్ పూర్ ఐఐటీ అద్భుత సృష్టి!

12-01-2020 Sun 06:34
  • 95 శాతం కచ్చితత్వం
  • బయో డీగ్రేడబుల్ పరికరం సిద్ధం
  • గ్రామీణ ప్రజలకు మరిన్ని వైద్య సేవలు

ఖరగ్ పూర్ ఐఐటీ పరిశోధకులు తయారుచేసిన ఓ పరికరం సీబీసీ (కంప్లీట్ బ్లడ్ కౌంట్) పరీక్షను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 10తో 95 శాతం కచ్చితత్వంతో సీబీసీ ఫలితాలను అందించే ఈ పరికరం బయో డీగ్రేడబుల్ అని ఐఐటీ డైరెక్టర్ వీకే తివారీ వెల్లడించారు.

మోటార్‌ ద్వారా నడిచే డిస్క్‌ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుందని, కొన్ని పరీక్షల అనంతరం దీన్ని డిస్పోజ్‌ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ కొత్త పరికరంతో గ్రామీణ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల విషయంలో ఓ కొత్త మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతీ ఒక్కరికి టెలీ మెడిసిన్, మొబైల్‌ హెల్త్‌ కేర్‌ అందేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని తివారీ తెలిపారు.