'అమరావతి పోరుకు నేను సైతం..' అంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్

11-01-2020 Sat 22:02
  • మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు
  • ఉద్యమకారుల పట్ల పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలి
  • బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలే

ఏపీ రాజధాని అమరావతి మార్పును వ్యతిరేకిస్తూ.. అక్కడి ప్రజలు చేస్తోన్న పోరాటంలో తాను కూడా పాల్గొంటానని తెలంగాణ కాంగ్రెస్ నేత ప్రకటించి సంచలనం రేపారు. నిరసన తెలుపుతున్న రైతులు, మహిళలు చేపడుతున్న ఉద్యమాన్ని చూసిన రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ త్వరలో తానూ పోరాటంలో ప్రత్యక్షంగా భాగస్వామినవుతానని ప్రకటించారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నారు. ఉద్యమకారులపట్ల పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. కేంద్రం వెంటనే కల్పించుకుని పెద్దన్న పాత్రను పోషించాలని కోరారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలన్నారు. అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు.