సీబీఐ జేడీ నియామకం అంశం.. విజయసాయిరెడ్డి లేఖకు అమిత్ షా స్పందన!

11-01-2020 Sat 21:17
  • హైదరాబాద్ లో సీబీఐ జేడీ నియామకం అంశంపై గతంలో లేఖ
  • విజయసాయి వినతిపై తగు చర్యలు తీసుకోవాలి
  • కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు అమిత్ షా ఆదేశాలు

హైదరాబాద్ లో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఏపీకి సంబంధంలేని అధికారిని నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై విజయసాయిరెడ్డి ప్రధానికి, హోంమంత్రికి ఓ లేఖ రాశారు. ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని నియమించాలన్న విజయసాయి వినతిపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను అమిత్ షా ఆదేశించారు.

కాగా, గత ఏడాది డిసెంబర్ 30న ఈ విషయమై విజయసాయిరెడ్డి లేఖ రాశారు. గతంలో సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, జగన్ కు ఇబ్బందులు సృష్టించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ ద్వారా అప్పటి జేడీ లక్ష్మీనారాయణకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసేవారని ఆ లేఖలో ఆరోపించారు.