కరీంనగర్ ను లండన్ లా చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?: వివేక్ వెంకటస్వామి

11-01-2020 Sat 19:49
  • ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చారా?
  • మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలం
  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయి

తెలంగాణ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరీంనగర్ ను లండన్ లా చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? చేశారా? ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఓట్లు అడగమని చెప్పారు? నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

‘మెగా’ కృష్ణారెడ్డి కోసమే మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, కమీషన్లు పొందారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ పౌరసత్వ సవరణ చట్టం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని, అక్రమ చొరబాటుదారులను అరికట్టేందుకే దీనిని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.