ఆ జిల్లాల్లో వేల ఎకరాలను జగన్ కబ్జా చేశారు: పంచుమర్తి అనురాధ ఆరోపణ

11-01-2020 Sat 19:35
  • గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 51,641 ఎకరాలు
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో 39,385 ఎకరాలు
  • జగన్ బినామీలుగా వైఎస్ వివేకా, ‘పెన్నా’ ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జగన్ భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 51,641 ఎకరాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో దాదాపు 39,385 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కబ్జా చేసిన భూములకు  జగన్ బినామీలుగా వైఎస్ వివేకానందరెడ్డి, ‘పెన్నా’ ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ ఉన్నారని ఆరోపించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కబ్జా చేసిన భూములకు బినామీలుగా విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నారని ఆరోపణలు చేశారు.