వైసీపీ చేస్తున్న ర్యాలీలకు ఎక్కడ నుంచి అనుమతులు వచ్చాయి?: నారా లోకేశ్

11-01-2020 Sat 18:58
  • ‘రాజధాని విభజన ముద్దు..అమరావతి వద్దు’ అన్నది వైసీపీ నినాదం! 
  • కేవలం ప్రతిపక్షాలు, రైతులు కోసమేనా ‘144 సెక్షన్’ ?
  • వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు చేసిన లోకేశ్

రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనపై నిప్పులు చెరుగుతూ రైతులు, అఖిలపక్ష నేతలు తలపెట్టిన నిరసనలు, ర్యాలీలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

‘రాజధాని విభజన ముద్దు.. అమరావతి వద్దు’ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ర్యాలీలకు అనుమతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో అమల్లో ఉన్న ‘144 సెక్షన్’ పైనా ఆయన విమర్శలు చేశారు. ఈ సెక్షన్ కేవలం ప్రతిపక్ష పార్టీలు, అమరావతి జేఏసీ, పోరాడుతున్న రైతులు, మహిళలకు మాత్రమే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు.