ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాది విష్ణు నియామకం

11-01-2020 Sat 16:14
  • వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  • కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ
  • ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్న మల్లాది

వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పదవి వరించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా మల్లాదిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో మల్లాది రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, ప్రస్తుతం మల్లాది టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నారు.