మానవ సంబంధాలున్న ప్రదేశాలన్నీ అందంగానే ఉంటాయి: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

11-01-2020 Sat 15:59
  • పోతన గారి పద్యం ‘అల వైకుంఠపురంలో.. నగరిలో..’
  • హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది
  • అందుకని, ‘అల.. వైకుంఠపురం’ అనే టైటిల్ పెట్టాం

ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పోతనగారి పద్యం ‘అల వైకుంఠపురంలో.. నగరిలో.. ఆ మూల.. ’. అలాంటి ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఆయన ఆ పద్యంలో చెప్పారు. మానవ సంబంధాలున్న ప్రదేశాలన్నీ అందంగానే ఉంటాయి. అలాంటి హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది’ అని. అందుకని, అల.. వైకుంఠపురంలో అనే టైటిల్ ఈ చిత్రానికి సముచితమనిపించిందని చెప్పారు.