ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

11-01-2020 Sat 15:47
  • హైపవర్ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • 18న కేబినెట్ భేటీ
  • రాజధానిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం

ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లో మూడు రాజధానుల ప్రతిపాదనలను చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు సూచించిన అంశాలు, సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలకంటే ముందే ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం ఈ భేటీలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. జీఎన్ రావు, బీసీజీ కమిటీ ఇచ్చిన నివేదికలు, హైపవర్ కమిటీ సిఫారసులు, పాలన వికేంద్రీకరణపై మరోసారి దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.