టెంటు పీకినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదు: నారా లోకేశ్

11-01-2020 Sat 13:57
  • వేలాది మంది పోలీసులతో కవాతు చేయించినంత మాత్రాన ఉద్యమాన్ని అణచలేరు
  • ఎంత తొక్కితే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుంది
  • రైతులను ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదు

అమరావతి ప్రాంత ప్రజల గొంతు నొక్కడం సాధ్యం కాదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వేలాది మంది పోలీసులతో గ్రామాల్లో కవాతు చేయించినంత మాత్రాన ఉద్యమాన్ని అణచలేరని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. టెంటు పీకేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదని అన్నారు

 జగన్ నిరంకుశ పాలనకు రాజధానిలో ఉన్న పరిస్థితులే కారణమని చెప్పారు. మీరు ఎంత తొక్కితే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుందని అన్నారు. రైతులను ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి పాడె కట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గళం విప్పుతున్నారని తెలిపారు. గ్రామాల్లోని గుళ్లకు కూడా తాళం వేసే పరిస్థితి వచ్చిందంటే... రాష్ట్రంలో ఎంత ఘోరమైన పాలన కొనసాగుతోందో అర్థమవుతోందని అన్నారు.