'లాఠీతో కొట్టిన పోలీసులకు అన్నం పెట్టిన రైతు' అంటూ వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు

11-01-2020 Sat 13:44
  • జగన్ మోహన్ రెడ్డి ఆర్డర్ వేస్తే పోలీసులు లాఠీతో కొట్టారు
  • అటువంటి పోలీసు సోదరులకు అన్నం పెట్టాడు రైతు
  • మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు

అమరావతి రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు చేస్తోన్న పోరాటాన్ని పోలీసులు అనేక విధాల అడ్డుకుంటున్నారన్న విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. అమరావతి కోసం జరుగుతోన్న ఆందోళనల్లో పరిస్థితిని అదుపు చేసేందుకు రైతులపై పోలీసులు లాఠీ ఛార్జీలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులకు రైతన్న అన్నం పెడుతున్నాడు.  

అమరావతిలో పోలీసులకు ఓ రైతు అన్నం పెట్టిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. 'ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్డర్ వేస్తే లాఠీతో కొట్టిన పోలీసు సోదరులకు అన్నం పెట్టి... మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు రైతు. జై అమరావతి. నా రాజధాని అమరావతి' అని చంద్రబాబు నాయుడు ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.