అల్లు అర్జున్‌కి గిఫ్ట్ పంపిన విజయ్‌ దేవరకొండ.. ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేసి బన్నీ హర్షం

11-01-2020 Sat 13:32
  • బన్నీకి బట్టలు పంపిన విజయ్ దేవరకొండ
  • చెప్పిన‌ట్టుగానే బ‌ట్ట‌లు పంపాడని బన్నీ ట్వీట్
  • ఈ బట్టలు వేసుకునే అల వైకుంఠపురంలో సెలబ్రేషన్‌కి వస్తానని వ్యాఖ్య

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ కొత్త దుస్తులు పంపాడు. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. 'నీకు చాలా కృతజ్ఞతలు సోదరా. ఇదో మధురానుభూతి.. నువ్వు చెప్పిన‌ట్టుగానే బ‌ట్ట‌లు పంపావు. ఈ డ్రెస్‌ను వేసుకొని అల వైకుంఠ‌పుర‌ములో సినిమా సెల‌బ్రేష‌న్‌కి వస్తా' అని అల్లు అర్జున్‌ తెలిపాడు.  

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో బన్నీతో త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.