రాజధాని రైతుల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్న నిర్మాత అశ్వనీదత్

11-01-2020 Sat 12:33
  • మందడంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం
  • అయినప్పటికీ మందడానికి అశ్వనీదత్
  • తమ బాధలు చెప్పుకుంటోన్న రైతులు

అమరావతి రాజధాని కోసం రైతులు పోరాడుతోన్న నేపథ్యంలో మందడంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మందడానికి వెళ్లిన సినీ నిర్మాత అశ్వనీదత్ రైతులకు సంఘీభావం తెలిపారు. తమ ఆందోళనల గురించి అశ్వనీదత్‌కు రైతులు వివరించి చెప్పారు. రాజధాని కోసం తాము భూములు ఇచ్చిన విషయాన్ని, ప్రభుత్వం మారగానే అమరావతి చుట్టూ జరుగుతోన్న పరిణామాలను అశ్వనీదత్‌కు తెలిపారు.

మందడంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ రైతులు ఆందోళనలను విరమించకుండా నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రైవేటు స్థలంలో కూర్చొని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో అశ్వనీదత్ వారిని కలవడం గమనార్హం. మందడంలో రైతులు ఓ చోట టెంటు వేసుకుని దీక్షకు దిగిన ప్రాంతానికి వెళ్లి ఆయన చర్చించారు.