చంద్రబాబు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. లోకేశ్ బయటకు వస్తే అరెస్ట్?

11-01-2020 Sat 11:41
  • చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
  • లోకేశ్ టీడీపీ కార్యాలయానికి బయల్దేరే మార్గంలో ముళ్ల కంచెలు
  • అమరావతి వైపునకు ఎవరూ వెళ్లకుండా పోలీసుల మోహరింపు 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన కుమారుడు లోకేశ్.. టీడీపీ కార్యాలయానికి బయల్దేరే మార్గంలో ముళ్ల కంచెలు, బారికేడ్లు, రోప్‌లు పెట్టారు. ఆయన నివాసం నుంచి ఎవరూ అమరావతి వైపునకు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు. పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు.

ఒకవేళ లోకేశ్ బయటకు వస్తే అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.