water flows upper: మేఘాలను ముద్దాడేస్తున్న సాగర జలాలు.. ఫారో ఐల్యాండ్ లో అద్భుత దృశ్యం

  • టోర్నడో తరహా ఒత్తిడితో ఈ ప్రక్రియ 
  • కొండ పైకి ప్రవాహంలా వెళ్తున్న సముద్రం నీరు 
  • ఆశ్చర్యచకితులవుతున్న నెటిజన్లు

పల్లం వైపు నీరు ప్రవహిస్తుందన్నది జగమెరిగిన సత్యం. అదే నీరు కొండ పైకి ప్రవహిస్తోందంటే ఆశ్చర్యమేకదా. ఈ ఆశ్చర్యకరమైన ఘటన డెన్మార్క్ లోని ఫారో ఐల్యాండ్స్ లో చోటు చేసుకుంది. ఇక్కడ సాగర జలాలు  మేఘాలను ముద్దాడేస్తున్నాయి. కొండ పైకి నీరు ప్రవహిస్తుండగా ఓ ఔత్సాహికుడు తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే... బీభత్సాన్ని సృష్టించే టోర్నడోలు గురించి తెలుసుకదా. టోర్నడో సంభవిస్తే ఆ ప్రాంతంలో ఏనుగు చిక్కుకున్నా గాల్లోకి ఎగరాల్సిందే. భూమిపై ఉన్న దుమ్ముధూళితో ఓ గొట్టంలా మారి మేఘాలను తాకేంత ఎత్తులో విశ్వరూపం ప్రదర్శిస్తుంది.

సరిగ్గా ఇటువంటి గాలి ఒత్తిడే డెన్మార్క్ లోని ఫారో ఐల్యాండ్స్ లో చోటు చేసుకోవడంతో సముద్రం నీరు తీరాన్ని ఆనుకుని కొండ పైకి కాలువలా ప్రవహించింది. ఇవి కొంత ఎత్తుకు వెళ్లాక బలహీనమై మళ్లీ కిందకు పడిపోతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు వీడియో తీసి నెట్టింట్లో ఉంచడంతో నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు.

More Telugu News