ఆయన కులాన్ని అన్నందుకు నన్ను టార్గెట్ చేశారు: పోసానిపై పృథ్వీరాజ్ ఫైర్

11-01-2020 Sat 10:35
  • పోసానికి పృథ్వీరాజ్ కౌంటర్
  • వైసీపీలో ఆయనకంటే నేనే సీనియర్
  • అమరావతి ఉద్యమంలో ఉన్నది రైతులు కాదు

రాజధాని కోసం ఉద్యమిస్తున్న అమరావతి రైతులు, మహిళలను పెయిడ్ ఆర్టిస్టులుగా పేర్కొన్న సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. వైసీపీకే చెందిన మరో సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా పృథ్వీరాజ్ పై విమర్శలు గుప్పించారు. అయినా, పృథ్వీ ఏమాత్రం తగ్గడం లేదు. పోసానికి తాజాగా కౌంటర్ ఇచ్చారు.

వైసీపీలో పోసాని కంటే తానే సీనియర్ నని స్పష్టం చేశారు. ఆయన సామాజికవర్గాన్ని అన్నందుకే తనను టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఉన్నది రైతులు కాదని... రైతుల ముసుగులో ఉన్న రౌడీలు, గూండాలు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికీ తన స్టాండ్ ఇదేనని.. అక్కడ ఆందోళన చేస్తున్నవారు పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు.