INS Vikramaditya: అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మోహరింపు

  • అరేబియా సముద్రంలో చైనా, పాక్ సైనిక విన్యాసాలు
  • అప్రమత్తమైన భారత్
  • క్షుణ్ణంగా గమనిస్తున్న భారత్

భారత్ తన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అరేబియా సముద్రంలో మోహరించింది. చైనా, పాకిస్థాన్‌లు సంయుక్తంగా అరేబియా సముద్రంలో నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత్.. విక్రమాదిత్యను మోహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర అరేబియా సముద్రంలో చైనా కదిలికలు పెరుగుతున్నాయి. దీంతో అటువైపు కన్నేసిన భారత్ నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. తాజాగా, చైనా, పాక్‌లు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో భారత్ ఐఎన్ఎన్ విక్రమాదిత్యను సముద్రంలో వ్యూహాత్మకంగా మోహరించింది.

More Telugu News