Taliban terrorists: కశ్మీర్‌లో చొరబాటుకు సిద్ధంగా 300 మంది ఉగ్రవాదులు: నిఘా వర్గాలు

  • పాక్ నిర్మించిన బంకర్లలో తలదాచుకున్న 300 మంది ఉగ్రవాదులు
  • పాష్టో భాషలో మాట్లాడుకుంటున్న ఉగ్రవాదులు
  • మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చొరబాటుకు రెడీ

జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు 300 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని కేంద్ర నిఘా విభాగం హోంమంత్రిత్వ శాఖకు తెలిపింది. నియంత్రణ రేఖకు ఆవల పాకిస్థాన్ నిర్మించిన బంకర్లలో వీరంతా తలదాచుకున్నారని, చొరబాటు కోసం వేచి చూస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హోంమంత్రిత్వ శాఖకు రహస్య నివేదిక సమర్పించాయి.

బంకర్లలో ఉన్నవారంతా తాలిబన్ ఉగ్రవాదులేనని, వారంతా పాష్టో భాషలో మాట్లాడుకుంటుండడాన్ని భారత జవాన్లు గుర్తించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. మంచు కరగడం ప్రారంభమయ్యే మార్చి, ఏప్రిల్ నెలల్లో చొరబాటుకు యత్నించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ నివేదికతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.

More Telugu News