సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

11-01-2020 Sat 07:39
  • ఇంట్లోనే సంక్రాంతి అంటున్న అనుష్క 
  • అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమా ప్లాన్ 
  • సాయితేజ్ సినిమా ఘన వసూళ్లు

 *  ఈ ఏడాది సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలసి జరుపుకుంటున్నానని చెప్పింది అందాలభామ అనుష్క. 'ఈ ఏడాది సంక్రాంతికి షూటింగ్ ఏదీ పెట్టుకోలేదు. ఫ్యామిలీతో కలసి పండగ చేసుకుంటాను. అందుకే ఇప్పుడు బెంగళూరు వెళుతున్నాను' అని చెప్పింది అనుష్క. కాగా, తను నటించిన 'నిశ్శబ్దం' చిత్రం వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది.
*  బాలీవుడ్ సినిమాలో నటించాలని తనకూ ఉందని అంటున్నాడు అల్లు అర్జున్. 'మంచి కథ, మంచి నిర్మాత, మంచి దర్శకుడు కనుక వస్తే కచ్చితంగా హిందీ సినిమా చేస్తాను. దక్షిణాది నటులకు అందరకూ ఉన్నట్టే హిందీ సినిమాలు చేయాలని నాకూ కోరికగా వుంది' అని చెప్పాడు.
*  మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా వచ్చిన 'ప్రతి రోజు పండగే' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్ల వరకు జరగగా, ఇప్పటివరకు దీని వసూళ్లు సుమారు 35 కోట్ల వరకు వున్నట్టు సమాచారం.