నెల్లూరు జిల్లాలోని మైపాడు, కొత్త కోడూరు బీచ్‌లకు మహర్దశ!

11-01-2020 Sat 06:29
  • మైపాడు, కొత్త కోడూరు బీచ్‌లకు ‘బ్లూఫాగ్’ గుర్తింపు
  • పర్యాటకంగా అభివృద్ధి చెందనున్న జిల్లా
  • పర్యాటకులకు సకల సౌకర్యాలు

నెల్లూరు జిల్లాలోని మైపాడు, కొత్త కోడూరు బీచ్‌లకు మహర్దశ పట్టనుంది. ఈ రెండు బీచ్‌లను ‘బ్లూ ఫాగ్’ కింద గుర్తించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ పరిరక్షణ శాఖ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి సర్వే చేసింది. ఈ బీచ్‌లకు ‘బ్లూ ఫాగ్’ గుర్తింపు దక్కితే పర్యాటకులకు సకల సౌకర్యాలు లభిస్తాయి. వారి కోసం వసతి సౌకర్యాలు కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలకు చర్యలు తీసుకుంటారు. అంతేకాదు, ఈ గుర్తింపు కనుక దక్కితే పర్యాటకంగా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని మినిస్ట్రీ ఆఫ్ ఎంవోఎఫ్ అధికారి సంజయ్ జ్వాల తెలిపారు.