ఏపీ డీజీపీతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి?

10-01-2020 Fri 21:48
  • అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులపై ఆరా  
  • డీజీపీకి ఫోన్ చేసిన మంత్రి
  • రైతుల ఆందోళనలపై అడిగి తెలుసుకున్న కిషన్ రెడ్డి

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు, ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు, ఆందోళనా కార్యక్రమాల గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఏపీకి మూడు రాజధానుల అంశం తమ దృష్టికి రాలేదని, అయినా, ఈ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోదని కిషన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.