Amaravati: డీజీపీ గౌతం సవాంగ్ మాటలు వినొద్దు.. చట్టాన్ని ఉల్లంఘించొద్దు: పోలీసులకు చంద్రబాబు పిలుపు

  • గౌతం సవాంగ్ రెండేళ్ల తర్వాత వెళ్లిపోతారు
  • మీరు, నేనూ ఇక్కడే ఉండాలి
  •  ‘ఒక రాష్ట్రం ఒక రాజధాని’ అనేదే మా నినాదం

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన గౌతం సవాంగ్ రెండేళ్ల తర్వాత వెళ్లిపోతారని, ఆయన మాటలు వినొద్దని, చట్టాన్ని ఉల్లంఘించవద్దని పోలీసులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ‘డీజీపీ గౌతం సవాంగ్ పోతాడు కానీ, మీరూ, నేనూ ఇక్కడే ఉండాలి’ అంటూ పోలీసులను ఉద్దేశించి బాబు వ్యాఖ్యలు చేశారు.

వీళ్ల నాయన సొత్తు.. వీళ్ల నాయన జాగీరా? 

ఈ సందర్భంగా మూడు రాజధానుల అంశంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముప్పై రాజధానులు ఇస్తామంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించారని, ‘వీళ్ల అబ్బ సొమ్ము..’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రంలో తాము తిరగకూడదని వ్యాఖ్యలు చేస్తున్నారని ఇదేమన్నా ‘వీళ్ల నాయన సొత్తు.. వీళ్ల నాయన జాగీరా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఒక రాష్ట్రం ఒక రాజధాని’ అనేది తమ నినాదం అని స్పష్టం చేశారు.

More Telugu News