మెరుపు ధర్నాకు దిగిన కేశినేని నాని, దేవినేని ఉమ... బందరు రోడ్డులో ఉద్రిక్తత

10-01-2020 Fri 20:28
  • మరింత ముదురుతున్న రాజధాని రగడ
  • ఇతర ప్రాంతాలకు పాకుతున్న నిరసనలు
  • విజయవాడలో టీడీపీ నేతల ఆందోళన

ఏపీలో రాజధాని ప్రకంపనలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. మొన్నటిదాకా రైతుల అరెస్టులు జరగ్గా, ఇప్పుడు నేతల అరెస్టులతో వాతావరణం మరింత వేడెక్కుతోంది. తాజాగా, బెజవాడ బందరు రోడ్డులో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ బందరు రోడ్డులో మెరుపు ధర్నాకు దిగారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసిన నానీని అదుపులోకి తీసుకున్నారు. నానీ అరెస్టుతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.