చివరి టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక.. చాన్నాళ్ల తర్వాత సంజూ శాంసన్ కు అవకాశం

10-01-2020 Fri 18:51
  • పుణేలోని ఎంసీఏ స్టేడియంలో మ్యాచ్
  • సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో భారత్
  • సిరీస్ పై కన్నేసిన టీమిండియా

భారత్, శ్రీలంక జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ కు పుణేలోని ఎంసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ పోరులో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఛేజింగ్ లో దిట్ట అని గ్రహించిన శ్రీలంక ఆతిథ్య జట్టుకు ఆ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. కాగా, మూడు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్ లో టీమిండియా నెగ్గింది. ఈ మ్యాచ్ లో నెగ్గితే సిరీస్ టీమిండియా వశమవుతుంది. ఓడితే సిరీస్ సమం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుదిజట్టులోకి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ను తీసుకుంది. మనీష్ పాండే కూడా తుదిజట్టులోకి వచ్చాడు.