హన్మకొండలో దారుణం... యువతి గొంతుకోసి హత్య

10-01-2020 Fri 18:39
  • ప్రియురాలిపై అనుమానం
  • నమ్మకంగా రప్పించి అంతమొందించిన యువకుడు
  • జడ్జి ఎదుట లొంగుబాటు

హన్మకొండలో దారుణం జరిగింది. ఇక్కడి రాంనగర్ లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. మృతురాలిని లష్కర్ సింగారం గ్రామానికి చెందిన హారతిగా గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన షాహిద్ కోర్టులో లొంగిపోయాడు. షాహిద్ హన్మకొండలోని రాంనగర్ లో అద్దె గదిలో ఉంటున్నాడు. మాట్లాడాలి అంటూ నమ్మకంగా హారతిని రప్పించి హత్య చేశాడు. షాహిద్ స్వస్థలం కాజీపేట. చైతన్యపురిలో ఓ మటన్ షాపులో పనిచేస్తున్నాడు. ప్రియురాలిపై అనుమానంతోనే షాహిద్ ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలుస్తోంది.