ఫుల్ బాటిల్ విస్కీ పందెం.. ప్రాణం తీసింది!

10-01-2020 Fri 18:23
  • నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లిలో ఘటన
  • అరగంటలో ఫుల్ బాటిల్ విస్కీ తాగాలని పందెం
  • విస్కీ సేవిస్తున్న క్రమంలో మృతి

ఓ పందెం ప్రాణం తీసింది. విస్కీ తాగాలన్న పందెంలో మందుబాబు మృతి చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లిలో జరిగింది. అరగంట సమయంలో ఫుల్ బాటిల్ విస్కీ తాగుతానని తోటి మిత్రులతో కాశయ్య అనే వ్యక్తి పందెం కాశాడు. ఫుల్ బాటిల్ అందుకుని మద్యం సేవిస్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అప్రమత్తమైన అతని మిత్రులు కాశయ్యను స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.