బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా మేం కూడా చాలా కష్టాలు పడ్డాం: అల్లు అర్జున్

10-01-2020 Fri 18:00
  • సంక్రాంతి కానుకగా వస్తున్న 'అల... వైకుంఠపురములో'  
  • జనవరి 12న రిలీజ్
  • మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ

'అల... వైకుంఠపురములో' చిత్రంతో మరికొన్నిరోజుల్లో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఎంటర్టయినర్ మూవీ జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. వారసులు కూడా సినీ పరిశ్రమలోకి రావడం అనేది వారి ఇష్టాయిష్టాలు, సెంటిమెంట్లపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

 తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాత కావడంతో టాలీవుడ్ ఎంట్రీ ఎంతో సులభంగా జరిగిపోయిందని వెల్లడించారు. అయితే, తన బ్యాక్ గ్రౌండ్ అంతవరకే పనిచేసిందని, ఆ తర్వాత కష్టాలు తప్పలేదని వివరించారు. ఎంత సినీ కుటుంబం నుంచి వచ్చినా తమ కష్టాలు తమకుంటాయని తెలిపారు. స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటులంటే తనకు ఎంతో గౌరవం అని బన్నీ చెప్పారు. వారిని చాలా గౌరవిస్తానని అన్నారు.