మా అమ్మమ్మ ఇదిగో... రాజధాని వృద్ధురాలిపై పవన్ ఆప్యాయత!

10-01-2020 Fri 17:44
  • పవన్ ను కలిసిన రాజధాని రైతులు
  • రైతులు, వారి కుటుంబ సభ్యులపై పవన్ వాత్సల్యం
  • కొండవీటి రాజమ్మలో తన అమ్మమ్మను చూసుకున్న జనసేనాని

రాజధాని ఆందోళనల నేపథ్యంలో గుంటూరు జిల్లా ధర్మవరం రైతులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేన కార్యాలయానికి వచ్చిన రైతులు, వారి కుటుంబ సభ్యులతో పవన్ ఆప్యాయంగా ముచ్చటించారు. ముఖ్యంగా కొండవీటి రాజమ్మ అనే వృద్ధురాలిని చూడగానే ఆమెలో తన అమ్మమ్మ జ్ఞాపకాలను వెదుక్కున్నారు. ఆ వృద్ధురాలిని ఆత్మీయంగా పొదివిపట్టుకుని మురిసిపోయారు. రాజమ్మను చూడగానే చిన్నప్పుడు మా అమ్మమ్మతో గడిపిన క్షణాలు జ్ఞప్తికి వచ్చాయని, మా అమ్మమ్మ, మేనత్తలను ఇలాగే పొదివిపట్టుకునేవాడ్నని పవన్ తెలిపారు. ఇక పవన్ ను కలిసిన కొండవీటి రాజమ్మ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. తన మనవడు ప్రవీణ్ గురించి చెబుతూ, వాడి ఆట, పాట అంతా పవన్ కల్యాణే అని చెప్పారు.