లోకేశ్, కళా వెంకట్రావులను అరెస్టు చేసిన పోలీసులు

10-01-2020 Fri 17:32
  • ఒంగోలు పర్యటనకు వెళ్లి తిరిగివస్తోన్న టీడీపీ నేతలు
  • రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదన్న పోలీసులు
  • ఖాజా టోల్ ప్లాజా వద్ద ఆపి అరెస్టు చేస్తున్నామంటూ నోటీసులు  

ఒంగోలు పర్యటనకు వెళ్లి తిరిగివస్తోన్న టీడీపీ నేతలు నారా లోకేశ్, కళా వెంకట్రావులను పోలీసులు అరెస్టు చేశారు. ఖాజ టోల్ ప్లాజా వద్ద వారిని ఆపిన పోలీసులు ముందుకు వెళ్లడానికి వీలులేదని తెలిపారు. అనంతరం అరెస్టు చేస్తున్నామంటూ వారికి నోటీసులు ఇచ్చారు.

రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు వారికి తెలిపారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఎవరినీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించలేదంటూ తనను పార్టీ కార్యాలయం వద్దకు పోనివ్వాలని లోకేశ్ చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులు లోకేశ్, కళా వెంకట్రావులను అదుపులోకి తీసుకున్న అనంతరం వారిని మంగళగిరి పార్టీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.