కాళ్లు పట్టుకుంటే ఆ స్టార్ కమెడియన్ కరుణించేవాడేమో: నటుడు శివారెడ్డి

10-01-2020 Fri 17:27
  • 'దూకుడు' మంచి పేరు తెచ్చిపెట్టింది 
  • ఆ స్టార్ కమెడియన్ వలన అవకాశాలు రాలేదు 
  • మిమిక్రీ లేకపోతే ఆగమైపోయేవాడినన్న శివారెడ్డి

ఎక్కడ ఏ ఈవెంట్స్ జరిగినా ఆ ఈవెంట్ లో శివారెడ్డి మిమిక్రీ వుంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. దేశ విదేశాల్లో జరిగిన ఎన్నో ఈవెంట్స్ లో శివారెడ్డి సందడి చేశాడు. ఎన్నో అవార్డులను .. షీల్డ్స్ ను గెలుచుకున్నాడు.

 తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'దూకుడు' సినిమాలో నా పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో నేను బిజీ అవుతానని చాలామంది అన్నారు. కానీ ఆ తరువాత ఒక్క అవకాశమూ రాలేదు. ఓ స్టార్ కమెడియన్ నాకు అవకాశాలు రాకుండా చేశాడు. సినిమాలను మాత్రమే నేను నమ్ముకుని వుంటే, ఆయన చేసిన పనికి నేను రోడ్డున పడేవాడిని. ప్రైవేట్ ఈవెంట్స్ .. స్టేజ్ షోలు .. టీవీ షోలు నన్ను ఆదుకున్నాయి. వేరే సోర్స్ లేకపోతే ఆయన కాళ్లు పట్టుకుని రాజీపడాల్సి వచ్చేదేమో. అప్పుడు కూడా ఆయన కరుణిస్తే సినిమాలు చేసుకునేవాడిని .. లేదంటే ఆగమై పోయేవాడినేమో" అని చెప్పుకొచ్చాడు.