మనిషిని మనిషిగా గౌరవించడం రాని మీరు పోలీసులా?: గల్లా జయదేవ్ ఆగ్రహం

10-01-2020 Fri 17:03
  • రాజధానిలో మహిళాగ్రహం
  • లాఠీలకు పనిచెప్పిన పోలీసులు!
  • మండిపడిన గల్లా జయదేవ్

సాధారణంగా ఎంతో సౌమ్యంగా ఉండే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహంతో ట్వీట్ చేశారు. అమరావతి కోసం ధర్నాలో పాల్గొంటున్న మహిళలపై పోలీసులు దాడి చేశారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. మహిళలన్న కనీసం గౌరవం లేకుండా లాఠీలతో కొట్టి పోలీస్ స్టేషన్లో పడేశారని, గాయాలకు ప్రథమచికిత్స కూడా అందించకుండా బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించారని ఆరోపించారు. మనిషిని మనిషిగా గౌరవించడం కూడా రాని మీరు పోలీసులా? అంటూ గల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాక్షసపాలన కాక మరేంటి? అని ప్రశ్నించారు.