'భీష్మ' టీజర్ రిలీజ్ డేట్

10-01-2020 Fri 16:56
  • వెంకీ కుడుముల నుంచి మరో ప్రేమకథ 
  • తొలిసారి నితిన్ జోడీగా రష్మిక 
  • వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా ఒక ప్రేమకథా చిత్రం రూపొందింది. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను సెట్ చేశారు. నితిన్ సరసన నాయికగా తొలిసారి రష్మిక నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదలనున్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. 'ఛలో' సినిమాతో దర్శకుడిగా వెంకీ కుడుముల మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆయన నుంచి వస్తున్న మరో ప్రేమకథా చిత్రం కావడంతో, యూత్ లో భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.