ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

10-01-2020 Fri 16:35
  • వీడియోకాన్ రుణాల కేసులో ఈడీ దర్యాప్తు
  • పలుమార్లు ఈడీ ఎదుట హాజరైన చందా కొచ్చర్
  • తాజాగా రూ.78 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

వీడియోకాన్ రుణాల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చందా కొచ్చర్ పలు మార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా కొచ్చర్, ఆమె కుటుంబసభ్యుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం రూ.78 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఇందులో చందా కొచ్చర్ పేరిట ముంబయిలో ఉన్న ఓ ఫ్లాట్, ఆమె భర్తకు చెందిన కంపెనీ ఆస్తులు కూడా ఉన్నాయి.