వారాన్ని లాభాలతో ముగించిన మార్కెట్లు

10-01-2020 Fri 16:07
  • పశ్చిమాసియాలో తగ్గుతున్న ఉద్రిక్తతలు
  • 147 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 41 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో, మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలు మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 41,600కి పెరిగింది. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 12,257 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (1.53%), ఇన్ఫోసిస్ (1.47%), మారుతి సుజుకి (1.37%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.33%), ఏసియన్ పెయింట్స్ (1.24%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.22%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.11%), టైటాన్ కంపెనీ (-0.76%), భారతి ఎయిర్ టెల్ (-0.58%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.49%).