జాన్వీని ఒప్పించే ప్రయత్నంలో పూరి?

10-01-2020 Fri 15:54
  • పూరి తదుపరి చిత్రంగా 'ఫైటర్'
  • త్వరలోనే సెట్స్ పైకి 
  • ముంబైలో ప్లాన్ చేస్తున్న పూరి  

పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయనున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను కూడా ఆయన సెట్ చేశాడు. ఈ సినిమాకి కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా వున్నాడు. అందువలన తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారనే వార్తలు వచ్చాయి. కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

డేట్స్ ఖాళీగా లేకపోవడం వలన ఆమె నో చెప్పిందనే వార్త రీసెంట్ గా వినిపించింది. దాంతో విజయ్ దేవరకొండ జోడీగా ఎవరు కనిపించనున్నారా అనేది అందరిలోను ఆసక్తికరంగా మారింది. అయితే పూరి మాత్రం ఎలాగైనా జాన్వీని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నాడట. అవసరమైతే ఆమె కాంబినేషన్లోని సీన్స్ ను ముంబైలోనే చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. లొకేషన్స్ పరంగా ఆమె ప్లానింగ్ కి అంతరాయం కలిగించకుండా వుంటే, ఆమె అంగీకరించవచ్చని భావిస్తున్నాడట.