తుళ్లూరు ఘటనపై రేపు రాష్ట్రానికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధారణ కమిటీ

10-01-2020 Fri 15:54
  • రాజధాని కోసం మహిళల ఆందోళన
  • తుళ్లూరులో మహిళలపై పోలీసు చర్య
  • సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్

రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసు చర్యకు దిగడాన్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధారణ కమిటీ రానుంది. కమిటీని రేపు పంపిస్తున్నామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ ఇప్పటికే పోలీసులకు నోటీసులు కూడా పంపింది. మహిళల్ని పోలీసులు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని, దురుసుగా ప్రవర్తించారని కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన కథనాలను కూడా కమిషన్ పరిశీలించింది.