జగన్ కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటికి వస్తారు: గోరంట్ల మాధవ్

10-01-2020 Fri 15:38
  • అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో ర్యాలీ
  • పాల్గొన్న గోరంట్ల మాధవ్
  • చంద్రబాబుపైనా వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి జగన్ మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటికి వస్తారని వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రిగా మరెన్నో ఏళ్ల పాటు జగన్ పాలన కొనసాగుతుందని అన్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో గోరంట్ల మాధవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
 
అంతేకాకుండా, విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు సాగు, తాగు నీటి కోసం పోరాడుతుంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పోరాడుతున్నారని ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు మాట్లాడిన మాటలు రాయలసీమలో మాట్లాడితే తంతారని వ్యాఖ్యానించారు.