రాజధాని ఉంటే అమరావతిలో లేదా కర్నూలులో ఉండాలి: భూమా అఖిలప్రియ

10-01-2020 Fri 15:32
  • రాయలసీమ వాసులు ఇప్పటికే ఎంతో నష్టపోయారు
  • రాజధాని రైతులకు ‘సీమ’ రైతులు అండగా ఉంటారు
  • ఇలా అయితే జిల్లాకో రాజధాని పెట్టాల్సి వస్తుంది

రాజధాని అమరావతిలో ఉండాలి లేదా కర్నూలులో ఉండాలని టీడీపీ నేత భూమా అఖిలప్రియ అన్నారు. రాష్ట్ర విభజనతో రాయలసీమ వాసులు ఇప్పటికే ఎంతో నష్టపోయారని గుర్తుచేశారు. అమరావతి రైతులకు రాయలసీమ రైతులు అండగా ఉంటారని అన్నారు. ఏపీకి మూడు రాజధానుల విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ, మూడు ప్రాంతాల్లో విద్వేషాలు రగిలితే, జిల్లాకో రాజధాని పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే న్యాయవాదులకు ఉపయోగమని, ప్రజలకు కాదని అన్నారు. ‘సీమ’కు హైకోర్టు ఇవ్వడంతో పాటు ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.