సీఏఏను నిరసిస్తూ హైదరాబాద్ లో ముస్లింల భారీ ర్యాలీ

10-01-2020 Fri 15:19
  • మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు 
  • భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు
  • బహిరంగ సభలో ప్రసంగించనున్న అసదుద్దీన్ ఒవైసీ

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా జాబితా (ఎన్పీఆర్)లను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఈరోజు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల తర్వాత ఈ ర్యాలీ ప్రారంభమైంది. హసన్ నగర్, ఆరంఘర్, మైలార్ దేవ్ పల్లి మీదుగా శాస్త్రిపురం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించనున్నారు. కాగా, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.