హ్యాపీ బర్త్ డే నాన్నా: అల్లు అర్జున్

10-01-2020 Fri 14:57
  • నేడు అల్లు అరవింద్ పుట్టినరోజు
  • ఎప్పటికీ నీవే నా ఫేవరెట్ అన్న అల్లు అర్జున్ 
  • ఇంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ ట్వీట్

పుట్టనరోజు సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశాడు. 'హ్యాపీ బర్త్ డే నాన్నా. ఎప్పటీకీ నీవే నా ఫేవరెట్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను' అంటూ ట్వీట్ చేశాడు. తన తండ్రిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను షేర్ చేశాడు.

తన తండ్రి అంటే అల్లు అర్జున్ కు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన 'అల వైకుంఠపురములో' ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా తన తండ్రి గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కొడుకు పుట్టిన తర్వాత తనకు ఒక విషయం అర్థమయిందని, తన తండ్రి అంతటి గొప్పవాడిని తాను ఎప్పటికీ కాలేనని చెప్పాడు. ఈ ప్రపంచంలో తనకు నాన్న కంటే ఏదీ ఎక్కువ కాదని అన్నారు. ఈ సందర్భంగా ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకున్నాడు.