జగన్ కోర్టుకు హాజరైతే టీడీపీ నేతలను గృహనిర్బంధం చేయడమెందుకు... సిగ్గులేదూ?: నారా లోకేశ్

10-01-2020 Fri 14:56
  • టీడీపీ, జేఏసీ నేతల హౌస్ అరెస్ట్
  • స్పందించిన నారా లోకేశ్
  • అక్రమ అరెస్టులతో ఏం సాధించలేరని వ్యాఖ్యలు

అమరావతి ఆందోళనల నేపథ్యంలో టీడీపీ నాయకులను గృహనిర్బంధం చేయడంపై మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జగన్ కోర్టుకు హాజరైతే టీడీపీ నేతలను గృహనిర్బంధం చేయడమెందుకని ప్రశ్నించారు. తప్పు చేసిన వ్యక్తి బహిరంగంగా తిరుగుతుంటే, రైతులకు అండగా నిలిచి శాంతియుత పోరాటం చేస్తున్న నేతలను, జేఏసీ సభ్యులను గృహ నిర్బంధం చేస్తున్నారు. సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. జగన్ ముందు తన తుగ్లక్ నిర్ణయాలను మార్చుకోవాలని లోకేశ్ హితవు పలికారు. ఒక ముఖ్యమంత్రి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతారా? అంటూ జాతీయస్థాయిలో చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.