అమరావతిలో మహిళా హోంగార్డుల మార్చ్ ఫాస్ట్

10-01-2020 Fri 14:53
  • మహిళా నిరసనకారుల నియంత్రణకేనన్న అధికారులు
  • అమరావతి చుట్టుపక్కల గ్రామాలకు విస్తరిస్తున్న ఆందోళనలు
  • మహిళా పోలీసులతో కలిసి పనిచేయనున్న హోంగార్డులు

అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ భద్రతను పెంచాలని భావిస్తోంది. ప్రధానంగా, నిరసనల్లో భారీ ఎత్తున పాల్గొంటున్న మహిళలను నియంత్రించడంకోసం అధిక సంఖ్యలో మహిళా పోలీసులు, హోంగార్డులను వినియోగించాలని పోలీసు విభాగం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళా పోలీసులకు తోడుగా మహిళా హోంగార్డులను అమరావతి ప్రాంతానికి తరలించారు. అమరావతి చేరుకున్న హోంగార్డులు వీధుల్లో కవాతు చేశారు. ఆందోళనలు అమరావతి ప్రాంత గ్రామాలకు విస్తరించడంతో మహిళల హోంగార్డులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.